హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వానికి చెందిన ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(నిన్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతానికి సంక్షిప్త ప్రకటన విడుదలైనప్పటికీ.. ఉద్యోగాల పూర్తిస్థాయి నోటిఫికేషన్ జులై 24న వెలువడనుంది. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక తదితర వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు ఉంటాయి. సరైన అర్హతలున్నవారు జులై 24 నుంచి ఆగస్టు 14 మధ్య ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 116
పోస్టుల వారీగా ఖాళీలు...
1) టెక్నికల్ అసిస్టెంట్: 45 పోస్టులు
జీతభత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400 చెల్లిస్తారు.
2) టెక్నీషియన్-1: 33 పోస్టులు.
జీతభత్యాలు: నెలకు రూ.19,900 - రూ.63,200 చెల్లిస్తారు.
3) ల్యాబొరేటరీ అటెండెంట్: 38 పోస్టులు.
జీతభత్యాలు: నెలకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: నిబంధనల మేరకు.
NOTE: ఉద్యోగాల పూర్తిస్థాయి నోటిఫికేషన్ 24.07.2023 వెలువడనుంది. అర్హతలు, వయోపరిమితి, ఎంపిక తదితర వివరాలను నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఉద్యోగాల పూర్తిస్థాయి నోటిఫికేషన్: 24.07.2023.
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.07.2023.
➥ దరఖాస్తు చివరి తేది: 14.08.2023
Job Notification Whatsapp Group:
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment