Trade Apprentice posts: ముంబయిలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 466 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఎనిమిదో తరగతి, పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జులై 26లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 466
ట్రేడ్లు: డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పైప్ ఫిట్టర్, స్ట్రక్చరల్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, రిగ్గర్, వెల్డర్ ఎలక్ట్రికల్.
1) ట్రేడ్ అప్రెంటిస్ (గ్రూప్-ఎ): 188
వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 15-19 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్: ఎంపికైనవారికి మొదటి సంవత్సరంలో మొదటి మూడునెలలు నెలకు రూ.3000, తర్వాతి 9 నెలలు నెలకు రూ.6000 చెల్లిస్తారు. తర్వాత రెండో ఏడాది నెలకు రూ.6600 చెల్లిస్తారు.
2) ట్రేడ్ అప్రెంటిస్ (గ్రూప్-బి): 225
వ్యవధి: ఏడాది.
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 16-21 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్: ఎంపికైనవారికి ఏడాదిపాటు నెలకు రూ.7700 - రూ.8050 చెల్లిస్తారు.
3) ట్రేడ్ అప్రెంటిస్ (గ్రూప్-బి): 53
వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 14-18 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్: ఎంపికైనవారికి ఏడాదిపాటు నెలకు రూ.7700 - రూ.8050 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 26.07.2023.
➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు 2023.
Job Notification Whatsapp Group:
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment