నాసిక్ రోడ్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ వెల్ఫేర్ ఆఫీసర్&జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 108 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 31 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 108
* వెల్ఫేర్ ఆఫీసర్: 01
అర్హత: డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 2 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.29740-రూ.103000 చెల్లిస్తారు.
* జూనియర్ టెక్నీషియన్: 107
విభాగాలు: టెక్నికల్, కంట్రోల్, స్టూడియో, స్టోర్, సీఎస్‌డీ, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఎన్‌సీవీటీ/ ఎస్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.18780-రూ.67390 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 31.07.2023.
0 comments:
Post a Comment