అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 30వ తేదీతో ముగియనుండగా.. జూలై 31 తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఏపీఎస్‌ఎఫ్‌సీ నిర్ణయం తీసుకుంది.
క్వాలిఫికేషన్ ఏంటంటే..?
అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఏ లేదా సీఎమ్‌ఏ లేదా ఎంబీఏ లేదా పీజీడీఎమ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎమ్‌ఎస్ ఆఫీస్, ఫైనాన్షియల్ మోడలింగ్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. బ్యాంక్స్,ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్,ఫైనాన్షింగ్,అకౌంటింగ్,టీఈవీ స్టడీ లేదా తత్సమాన సంస్థలో కనీసం ఏడాదిపాటు పని అనుభవం ఉండాలి.అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) పోస్టులకు సంబంధించి అభ్యర్ధులు మెకానిక్,సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో 60 శాతం మార్కులతో బీటెక్ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. లా డిగ్రీలో 55 శాతం డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
ఎలిజిబిలిటీ : సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ, సీఎంఏ లేదా బీఈ, బీటెక్, పీజీడీఎం, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.35,000.
దరఖాస్తు ఫీజు: రూ.590. (ఎస్సీ, ఎస్టీలకు రూ.354).
ఎంపిక : ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 31
0 comments:
Post a Comment