ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 15
➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 04
➥ అసిస్టెంట్ గ్రేడ్-3: 04
➥ టెక్నీషియన్: 04
➥ టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్): 01
➥ అసిస్టెంట్ డైరెక్టర్ (ఓఎల్): 01
➥ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: 01
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30.06.2023 నాటికి టెక్నీషియన్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 18 - 28 సంవతసరాలు; ఇతర పోస్టులకు 18 - 27 సంవతసరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.06.2023.
చిరునామా: Registrar, Wildlife Institute of India,
Dehradun-248001.
Job Notification Telegram Link:
Whatsapp Job Notification Group:
0 comments:
Post a Comment