Telangana Mega Job Mela: తెలంగాణలో ఎల్లుండి భారీ జాబ్ మేళా.. 90కి పైగా కంపెనీల్లో 5 వేలకు పైగా జాబ్స్.. వివరాలివే

తెలంగాణలో మరో భారీ జాబ్ మేళాకు (Job Mela) ఏర్పాట్లు సాగుతున్నాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 90కి పైగా కంపెనీలు పాల్గొనున్నాయి. తద్వారా 5 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలను (Jobs) కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ రోడ్డు లోని ట్రినిటి విద్యా సంస్థల ఆవరణలో నిర్వహించే మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆ రోజు ఉదయం 8 గంటలకే నిరుద్యోగులు పెద్దపల్లికి వచ్చి తమ పేరును రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని సూచించారు. ఉదయం నుంచే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఎంపికైన వారికి సాయంత్రమే నియామకపు పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలను పొందాలని ఆయన సూచించారు.

Job Notification Whatsappp Group:

Job Notification Telegram Group:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top