IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్నికల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌, డిగ్రీ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైర్-1 పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 3 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 23 వ‌ర‌కు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
వివరాలు..

మొత్తం పోస్టులు: 797

పోస్టుల కేటాయింపు: జనరల్-325, ఈడబ్ల్యూఎస్-79, ఓబీసీ-215, ఎస్సీ-119, ఎస్టీ-59.

అర్హత‌లు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌, డిగ్రీ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వ‌యోపరిమితి: 18 నుంచి 32 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఇందులో రూ.50 పరీక్ష ఫీజు కాగా, రూ.450 ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: మూడు దశల్లో (టైర్-1, టైర్-2, టైర్-3) ఎంపిక విధానం ఉంటుంది. టైర్-1(ఆన్‌లైన్ పరీక్ష)-100 మార్కులు, టైర్-2(స్కిల్ టెస్ట్)-30 మార్కులు, టైర్-3(ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్)-20 మార్కులు ఆధారంగా.

పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 25 శాతం ప్రశ్నలు, కంబైన్డ్ సబ్జెక్టుల నుంచి 75 శాతం ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. పరీక్షలో కటాఫ్ మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-34, ఎస్సీ/ఎస్టీ-33గా నిర్ణయించారు. 

జీతం: రూ.25,500-రూ.81,100. ఇతర అలవెన్సులు అదనం.

ముఖ్యమైన తేదీలు..

* నోటిఫికేషన్ వెల్లడి: 30.05.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.06.2023.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 23.06.2023. (11.59 PM)

* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.06.2023.

Job Notification Whatsappp Group:

Job Notification Telegram Group:


Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top