Railway : రాత పరీక్ష లేకుండా రైల్వేలో 1033 జాబ్స్‌.. 10వ తరగతి పాసై ఈ అర్హతలుండాలి

Indian Railway SECR Recruitment 2023 : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) 2023-24 సంవత్సరానికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్‌).. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1033 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకెళ్తే..

ట్రేడ్ అప్రెంటిస్: 1033 ఖాళీలు

ట్రేడ్‌లు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్‌ ఎయిర్‌ కండీషనర్‌, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (01-07-2023 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది : జూన్‌ 22, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ :https://secr.indianrailways.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top