నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిపికేషన్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం.. ఇన్‌స్టిట్యూట్‌లోని ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nits.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి అభ్యర్థులకు కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 27గా ఉండగా.. హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ జూలై 7గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఖాళీల పోస్టులు
మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో జనరల్ కేటగిరీ కింద 21, ఈడబ్ల్యూఎస్ 06, ఓబీసీ 22, ఎస్సీ 11, ఎస్టీ 08 కేటగిరీల వారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు ఫీజు..
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST మరియు PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి..
Step 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ nits.ac.inని సందర్శించండి.
Step 2: ఆపై హోమ్‌పేజీలో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ 2023పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
Step 4: ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించండి.
Step 5: ఇప్పుడు అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
Step 6: ఆ తర్వాత అభ్యర్థి ఫారమ్‌ను సమర్పించండి.
Step 7: ఇప్పుడు అభ్యర్థి ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకోండి.
అభ్యర్థులు అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీని డీన్ (FW), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్, P.O.కి పంపాలి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు వెబ్ సైట్ ను సందర్శించండి
0 comments:
Post a Comment