NHAI Recruitment: బీటెక్ అర్హత.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఖాళీగా ఉన్న 50 డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హతలు..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి.

వయో పరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. అయితే.. దరఖాస్తు చేసుకునే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ సడలింపు ఉంటుంది.

జీతం..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,600 నుంచి రూ.39,100 వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

Step 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి దాని కోసం ఈ వెబ్ సైట్ http://www.nhai.gov.in సందర్శించండి.

Step 2: ఇప్పుడు అభ్యర్థి హోమ్ పేజీలో వేకెన్సీ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 3: అభ్యర్థులు డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి.. ఫారమ్‌ను పూరించండి.

Step 4: దీని తర్వాత.. అభ్యర్థి హోమ్ పేజీలోని లింక్‌పై ఫోటోగ్రాఫ్ / సంతకం / సర్టిఫికేట్‌లతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

Step 5: ఆ తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను తప్పులు లేకుండా సరి చూసుకోండి.

Step 6: ఇప్పుడు అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించడానికి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

Step 7: తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top