BPNL Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3444 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే

నిరుద్యోగులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్వే ఇన్‌ఛార్జ్ (Survey in charge), సర్వేయర్ (Surveyor) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. మొత్తం 3444 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

1. సర్వే ఇన్‌ఛార్జ్ 574 పోస్టులు
2. సర్వేయర్ 2870 పోస్టులు
మొత్తం పోస్టులు: 3444

విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్య‌ర్థులు ఆయా పోస్టుల ఆధారంగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్, ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

అప్లికేషన్ ఫీజు : సర్వే ఇన్‌ఛార్జ్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.944, సర్వేయర్ ఉద్యోగాలకు రూ.826 చెల్లించాల్సి ఉంటుంది.

Job Notification Whatsapp Group:


Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top