NPCIL : న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో 325 ఉద్యోగాలు.. B Tech వాళ్లు అర్హులు.. నెలకు రూ.56,100 జీతం

NPCIL Recruitment 2023: ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (NPCIL).. 325 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే.. వ్యాలిడ్‌ గేట్ 2021/ 2022/ 2023 స్కోరు ఉండాలి. నోటిఫికేషన్‌ ప్రకారం అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 28, 2023వ తేదీ నాటికి 26 ఏళ్లకు మించకుండా ఉండాలి.ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానం ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ అర్హతలున్న వారు ఏప్రిల్ 28, 2023వ తేదిలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు విషయనికొస్తే.. రిజిస్ట్రేషన్‌ సమయంలో జనరల్ కేటగరికి చెందిన వారు రూ.500లు తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.56,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.npcilcareers.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top