ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను పెంచింది. అదనంగా 148 పోస్టులను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటన విడుదల చేసింది.దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 9,360కి పెరిగింది. కాగా దేశవ్యాప్తంగా ఇటీవల 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష/మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25తో ముగియనుంది. పెరిగిన పోస్టుల దృష్ట్యా అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును మే 2 వరకు పొడిగిస్తూ సీఆర్‌పీఎఫ్ తన ప్రకటనలో తెల్పింది.
అభ్యర్థుల వయోపరిమితి నిబంధనల్లో కూడా మార్పులు చేసింది. కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టులకు సంబంధించి గతంలో 21 నుంచి 27 ఏళ్ల పరిమితి విధించగా.. తాజాగా 21 నుంచి 30 ఏళ్లకు సడలించింది. మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మన్, బార్బర్, సఫాయి కర్మచారి, మేసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు గతంలో 18 నుంచి 23 ఏళ్ల వయోపరిమితి ఉండగా.. దానిని కూడా ప్రస్తుతం 18 నుంచి 26 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎత్తు, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులకు సంబంధించి కూడా పలు మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
0 comments:
Post a Comment