ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ సబ్ సర్వీసులో 30 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3. (ప్రకటన
నం.24/2021) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏప్రిల్ 12న ప్రధాన పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలతో పాటు తుది కీని విడుదల చేసింది. ప్రధాన పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 17న ప్రధాన కేంద్రాల్లో సీబీటీ విధానంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ద్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 28న ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఏయే సర్టిఫికెట్లను తీసుకురావాలో ఆయా వివరాలను సూచించింది. ఏ అభ్యర్థి అయినా వెరిఫికేషన్లు హాజరుకాకపోతే, మెరిట్ జాబితాలో తదుపరి అభ్యర్థిని పిలుస్తారు.
0 comments:
Post a Comment