ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్ఎల్) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.దీనిద్వారా 495 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 17 నుంచి 20 వరకు నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 495
పోస్టుల వారీగా ఖాళీలు..
1) కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 80
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.
2) జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 64
అర్హత: ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.
3) ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 121
అర్హత: ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.
4) హ్యాండిమ్యాన్: 230
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది
ఇంటర్వ్యూ వేదిక: Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai -600043.
ఇంటర్వ్యూ తేది: 17, 18, 19, 20.04.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.
Application send all job
ReplyDelete