ఫుడ్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా. ఎఫ్ సీఐలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 46 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఎఫ్సీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఎఫ్సీఐ అధికారిక వెబ్ సైట్ fci.gov.in లో తమ దరఖాస్తును సమర్పించాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన నెలలోపు తమ దరఖాస్తులను సమర్పించాలి. ఈ రిక్రూట్ మెంట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన జరగనుంది. ఎంపికైన అభ్యర్థులు 03ఏళ్ల పదవీకాలానికి నియమిస్తారు. 5ఏళ్ల వరకు దానిని పొడగించే ఛాన్స్ ఉంటుంది.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీలు 46
-అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 26
-అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఈఎం) 20
ఏఈ అర్హతలు:
ఈపోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. కనీసం ఐదేళ్ల పని అనుభవం తప్పనిసరి. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడండి.
ఈఎం అర్హతలు:
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. ఐదేళ్ల అనుభవం ఉండాలి. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
వేతనం:
పై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 60, 000 నుంచి 1,80,000వరకు ఉంటుంది.
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment