బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMGS I) పరీక్ష 2023లో ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.
అభ్యర్థులు తమ BOI PO అడ్మిట్ కార్డ్‌ని అధికారిక వెబ్‌సైట్ bankofindia.co.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు .
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 19 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 500 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. వాటిలో 350 జనరల్ బ్యాంకింగ్ స్ట్రీమ్‌లోని క్రెడిట్ ఆఫీసర్‌ల కోసం మరియు 150 స్పెషలిస్ట్ స్ట్రీమ్‌లోని IT ఆఫీసర్ల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
అడ్మిట్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అధికారిక వెబ్‌సైట్ bankofindia.co.in కి వెళ్లండి .
-హోమ్‌పేజీలో 'డౌన్‌లోడ్ కాల్ లెటర్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
-స్క్రీన్ పై అడ్మిట్ కార్డు లింక్ కనిపిస్తుంది.
-ఇప్పుడు మీ లాగిన్ వివరాల సహాయంతో లాగిన్ చేయండి.
-స్మార్ట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నట్లు ప్రకటించింది. మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (BOI Notification) పేర్కొంది బ్యాంక్ ఆఫ్ ఇండియా. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 25న ముగిసంది.
క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జనరల్ బ్యాంకింగ్: ఈ విభాగంలో 350 ఖాళీలు ఉన్నాయి.
ఐటీ ఆఫీసర్: ఈ విభాగంలో మరో 150 ఖాళీలు ఉన్నాయి.
0 comments:
Post a Comment