ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 3,546 ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లా న్యాయస్థానాల్లో కార్యాలయ సిబ్బంది నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలు మార్చి 29న వెల్లడయ్యాయి. నియామకాల్లో భాగంగా డిసెంబర్ 22 నుంచి జనవరి 2 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. జనవరి 4న కీని విడుదల చేసింది. ఇప్పటికే హైకోర్టు నియామకాలకు సంబంధించి 241 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాఉంటుంది. స్టెనో, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఎంపికైన వారికి స్కిల్ టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.
ఫలితాలు కు సంబంధించిన పిడిఎఫ్ ఫైల్స్:
0 comments:
Post a Comment