ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(Institute Of Banking Personnel Selection) ద్వారా IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు 17 ఫిబ్రవరి 2023 వరకు అధికారిక సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఐబీపీఎస్ పేర్కొంది. రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 710 ఖాళీలను భర్తీ చేస్తారు. IBPS ఇంటర్వ్యూ షెడ్యూల్ త్వరలో విడుదల చేయబడుతుందని ఐబీపీఎస్ పేర్కొంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులు వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో నియమితులవుతారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ 1 నవంబర్ 2022 నుండి ప్రారంభమై.. 21 నవంబర్ 2022 వరకు కొనసాగింది.ఖాళీలు..
ఈసారి నిర్వహించే పరీక్షలతో మొత్తం 710 ఖాళీలను భర్తీ చేయాలని IBPS లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐటీ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుకు 44, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I) 516, రాజభాష అధికారి (స్కేల్ I) 25, లా ఆఫీసర్ (స్కేల్ I) 10, హెచ్‌ఆర్/పర్సనల్ 15 ఖాళీలు, స్కేల్ I అధికారి , మార్కెటింగ్ అధికారి పోస్టులు 100 ఖాళీగా ఉన్నాయి.
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:
Job Notifications Telegram Group:
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment