1,151 పెరిగిన కానిస్టేబుల్ పోస్టులు, సవరణ నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు ఇలా!

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీ ప్రకటనలో ఉద్యోగ ఖాళీల సంఖ్యలో మార్పులు చేసింది

మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. పదోతరగతి విద్యార్హతగా పేర్కొన్న ఈ ఉద్యోగాలకు జనవరిలో రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

పెరిగిన పోస్టులు ఇలా..

తాజాగా విడుదల చేసిన సవరణ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 46,435 ఖాళీల్లో బీఎస్ఎఫ్లో 21,052; సీఐఎస్ఎఫ్లో 6,060; సీఆర్పీఎఫ్లో 11,169; ఎస్ఎస్బీలో 2274; ఐటీబీపీలో 1890, ఏఆర్లో 3601, ఎస్ఎస్ఎఫ్లో 214, ఎన్సీబీలో 175 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 41,250 పోస్టులు పురుషులకు, 5010 పోస్టులు మహిళలకు కేటాయించారు.

* పోస్టుల వివరాలు...

విభాగాల వారీగా ఖాళీలు..

1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 21,052

2) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 6060

3) సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్(CRPF): 11,169

4) సశస్త్ర సీమాబల్ (SSB): 2274

5) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1890

6) అసోం రైఫిల్స్ (AR): 3601

7) సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF): 214

8) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB): 175

SSC GD Constable Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top