CDAC : ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 570 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. రూ.22 లక్షల వరకూ జీతం

Engineering Jobs : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు 570 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు: 570

ప్రాజెక్ట్ అసోసియేట్-30

ప్రాజెక్ట్ ఇంజినీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-300

ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ 

మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔట్‌రీచ్ మేనేజర్-40

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ అండ్‌ ఔట్‌రీచ్ ఆఫీసర్-200

ముఖ్య సమాచారం:

విభాగాలు: ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, మైక్రోప్రాసెసర్ అండ్‌ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, ఏఐ అండ్‌ లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్, డిపెండబుల్ అండ్ సెక్యూర్ కంప్యూటింగ్ మిషన్, జెన్‌నెక్ట్స్‌ అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హతలు:
ప్రాజెక్ట్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.3.6లక్షలు-రూ.5.04 లక్షలు చెల్లిస్తారు.

ప్రాజెక్ట్ ఇంజినీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 0-4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.4.49లక్షలు-రూ.7.11లక్షలు చెల్లిస్తారు.

ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔట్‌రీచ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 9-15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.12.63లక్షలు-రూ.22.9లక్షలు చెల్లిస్తారు.

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ అండ్‌ ఔట్‌రీచ్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.8.49లక్షలు-రూ.14లక్షలు చెల్లిస్తారు.

పని ప్రదేశం: బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, మొహాలీ, ముంబై, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా, జ‌మ్మూ, సిల్‌చర్‌, పుణెలోని కార్పొరేట్‌ కార్యాలయం, గువాహటి, శ్రీనగర్, చండీగఢ్‌.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 20, 2023

Registration Link

వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:


Job Notifications Telegram Group:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top