నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు 10 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుందని రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 78 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, రక్షణ శాఖ, రైల్వే శాఖ, హోమ్ శాఖల్లో ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రైల్వే శాఖలో అకౌంటింగ్ కోసం 2.93 లక్షల ఖాళీలు, డిఫెన్స్ లో 2.64 లక్షల ఖాళీలు, హోమ్ శాఖలో 1.43 లక్షల ఖాళీలు ఉన్నట్లు గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అడిగిన ప్రశ్నకు.. జవాబుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోజ్ గర్ మేళా ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంలో 10 లక్షల మంది యువతకు లాభదాయకమైన సేవలను అందించడంతో పాటు.. ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడంలో ఉత్ప్రేరకంగా పని చేస్తుందని తెలిపారు. రోజ్ గర్ మేళా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించబడుతున్నాయని.. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్త సంస్థల్లో కొత్త నియామకాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశామని, ఉత్తమ విధానాలను అవలంభించేందుకు కేంద్రం, రాష్ట్రాల్లో రిక్రూట్మెంట్ వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేశామని తెలిపారు.
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment