Union Bank Of India Recruitment 2023 | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా 42 చార్టర్డ్ అకౌంటెంట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు...

మొత్తం ఖాళీలు: 42

పోస్టుల వారీగా ఖాళీలు..

1) చార్టర్డ్ అకౌంటెంట్: 03 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఎస్టీ-01, ఓబీసీ-02.

అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. 

అనుభవం: చార్టర్డ్ అకౌంటెంట్‌గా కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. బ్యాంకులు, బ్యాంకింగ్ సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

2) సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 34 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఎస్టీ-10, ఎస్టీ-13, ఓబీసీ-11.

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. సీఏఐఐబీ/ఎంబీఏ(ఫైనాన్స్)/సీఎంఏ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్ అర్హత ఉండాలి. 

అనుభవం:  కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ క్రెడిట్ (షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్) విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

3) మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 05 పోస్టులు

పోస్టుల కేటాయింపు: ఎస్టీ-05.

అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. సీఏఐఐబీ/ఎంబీఏ(ఫైనాన్స్)/సీఎంఏ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్ అర్హత ఉండాలి. 

అనుభవం:  కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ క్రెడిట్ (షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్) విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 22 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.

పరీక్ష విధానం..

మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఫ్రొఫెషనల్ నాలెడ్జ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.

పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కేటాయిస్తారు.

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 3 : 1 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

పర్సనల్ ఇంటర్యూకు 50 మార్కులు, గ్రూప్ డిస్కషన్‌కు 50 మార్కులు ఉంటాయి. వాటిల్లో కనీస అర్హత మార్కులను ఒక్కోదానిలో 25గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 22.5 మార్కులుగా నిర్ణయించారు

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2023.

దరఖాస్తు చివరి తేది:12.02.2023

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి

https://chat.whatsapp.com/Hu5S9VkL2QLGy9hznC8u9F

Telegram Group: https://t.me/apjobs9


Online Application: Click Here


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top