అర్హతలు...
ని ర్దేశిత గ్రూప్‌లలో 2023లో డిగ్రీ పూర్తి చేసుకోనున్న విద్యార్థుల కోసం స్మార్ట్ హైరింగ్ ప్రక్రియను టీసీఎస్‌లోప్రారంభించింది.
బీసీఏ, బీఎస్సీ(మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/బయో కెమిస్ట్రీ/కంప్యూటర్ సైన్స్, ఐటీ), కంప్యూటర్ సైన్స్/ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సులను 2023 లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులను అర్హులుగా పేర్కొంది. పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు ప్రతి స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు లేదా 5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి.
బ్యాచిలర్ డిగ్రీలో ఒక బ్యాక్‌లాగ్ మాత్రమే ఉండాలి. అకడమిక్ గ్యాప్ రెండేళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. విద్యార్థుల వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. క్యాంపస్ డ్రైవ్స్ విధానంలో నియామక ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతోంది. దీంతో అటు విద్యార్థులకు, ఇటు సంస్థకు సమయం ఆదా అయ్యేలా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ దోహదపడుతుంది.
ఫ్రెషర్స్‌కే 3 లక్షల వరకు ప్యాకేజీ...
టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ ద్వారా ఏటా దాదాపు 35 వేల నుంచి 40 వేల మంది వరకూ ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటోంది. జాతీయ స్థాయిలో దాదాపు రెండువేలకు పైగా ఇన్ స్టిట్యూట్‌ల విద్యార్థులకు ఈఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల శిక్షణ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆఫర్ ఖరారు చేసుకున్న వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారు. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ అంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ స్కిల్స్, ఇతర సాఫ్ట్ స్కిల్స్‌లోనూ నైపుణ్యం పొందేలా శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వారి ఆసక్తి మేరకు ఐటీ లేదా బీపీఎస్ విభాగాల్లో నియామకాలు ఖరారు చేస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది.
రాత పరీక్ష.. మూడు విభాగాలు
తొలుత ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల(వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరిక్ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 15-20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. క్వాలిఫై అయిన వారిని టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. చివరగా హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది.ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను, సాఫ్ట్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో విజయం సాధిస్తే.. నియామకం ఖరారు చేసి..ఆరు నెలలపాటు నిర్వహించే శిక్షణకు పంపుతారు.
రిజిస్ట్రేషన్ ఇలా....
టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2023కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://nextstep.tcs.com/campus/#/ లో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐటీ, బీపీఎస్ విభాగాల్లో తమకు ఆసక్తి ఉన్న విభాగంపై క్లిక్ చేయాలి. తర్వాత దశలో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. అదే విధంగా నిర్దేశిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ముఖ్య తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2023
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 10, 2023∙ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.tcs.com/careers/india/tcs-smart-hiring-2023 చూడండి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్: https://nextstep.tcs.com/campus
Important Job Notifications:
Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/Hu5S9VkL2QLGy9hznC8u9F
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment