నిరుద్యోగులకు నైపుణ్యాలు పెంచుకునేందుకు, అదే సమయంలో స్టైఫండ్ అందుకునేందుకు ప్రభుత్వరంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్-SAIL) అవకాశం కల్పిస్తోంది. సెయిల్‌కి చెందిన ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఒక సంవత్సరం పాటు పని చేసేందుకు అప్రెంటిస్‌లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం.
పోస్టుల వివరాలు
గ్యాడ్యుయేషన్ ఇంజినీర్, డిప్లొమా ఇంజినీర్‌లో మొత్తం 120 పోస్టులకు భిలాల్ సెయిల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కంపెనీ అవసరాల రీత్యా ఖాళీల సంఖ్యలో మార్పు జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. గ్రాడ్యుయేషన్ ఇంజినీర్(60): మెటాలర్జీలో అత్యధికంగా 25 పోస్టులున్నాయి. మైనింగ్‌లో 15, మెకానికల్ విభాగంలో 10, ఎలక్ట్రికల్‌లో 10 పోస్టులున్నాయి. డిప్లొమా ఇంజినీర్(60): మెటాలర్జీ విభాగంలో 20, మైనింగ్‌లో 20, సివిల్(10), సీఎస్/ఐటీ(10)
దరఖాస్తు విధానం, అర్హత
దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా భిలాయ్ అధికారిక వెబ్‌సైట్ portal.mhrdnats.gov.in ఓపెన్ చేయాలి. అక్కడ హోమ్ పేజీలో కనిపించే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అవసరమైన వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి. చివరిగా అప్లికేషన్ ఫీజు చెల్లించి అక్నాలెడ్జ్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ పోస్టులకు బీటెక్ పాసై ఉండాలి. డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు పాలిటెక్నిక్ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అయితే, అప్రెంటిస్‌షిప్ ప్రారంభమయ్యే సమయానికి అభ్యర్థికి మూడేళ్ల గ్యాప్ మించకూడదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యార్థులకు తొలి ప్రాధ్యాన్యం ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే మొదటగా రాష్ట్ర అభ్యర్థులను ఫిల్ చేశాక ఏమైనా ఖాళీలు మిగిలితే ఇతర రాష్ట్రాల అభ్యర్థులను తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు.
ఎంపిక విధానం
ఆయా కోర్సుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికేట్స్‌తో మేనేజ్‌మెంట్ సూచించిన ప్రాంతానికి వెరిఫికేషన్‌కి రావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్లాంట్, మైనింగ్ ప్రాంతంలో ఉద్యోగం కల్పించే అవకాశం ఉంది. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్(BOAT) సూచించిన ఆధారంగా అభ్యర్థులకు స్టైఫండ్ అందజేస్తారు.
ఉద్యోగ అవకాశం లేదు
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఢిల్లీ-రాజారా, హర్రి, నందిని మైన్స్ ప్రాంతాల్లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లలో ట్రైనింగ్ ఉంటుందని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇది కేవలం అప్రెంటిస్ వరకు మాత్రమేనని స్పష్టం చేసింది. అప్రెంటిస్‌షిప్ పూర్తయ్యాక ఉద్యోగం కల్పించబోమని సెయిల్ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.
Important Job Notifications:
Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/IMIQGMIboOH0JLIo0C5Qdk
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment