Railway Jobs : రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో 19,800 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన వెలువడిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రకటన అవాస్తవమని రైల్వే సీపీఆర్‌వో తెలిపారు. ఉద్యోగ ప్రకటనలను ద.మ. రైల్వే అధికారిక వెబ్‌సైట్లో ఉంచుతామని స్పష్టం చేశారు. తప్పుడు ప్రకటనలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే దళారుల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు.
0 comments:
Post a Comment