నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్(Electronics) అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరపున వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థఉలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవియేటర్ II మరియు టెక్నికల్ అసిస్టెంట్(Technical Assistant) వంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌ల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దరఖాస్తులు 31 డిసెంబర్ 2022 న ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 21 జనవరి 2023. అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
NIELIT NTROలో విడుదలైన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏవియేషన్ టెక్నాలజీ - 22 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ - 138 పోస్టులు
అర్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హత పోస్టును బట్టి భిన్నంగా ఉంటుంది. డిగ్రీ లేదా పీజీ చేసిన వారు అర్హులుగా నోటీస్ లో పేర్కొన్నారు. వయోపరిమితి విషయానికొస్తే.. గరిష్టంగా 30 సంవత్సరాల వరకు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఇలా..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో 200 మార్కులకు రాత పరీక్ష, రెండో దశలో 50 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. వివరాలను తెలుసుకోవడానికి .. మీరు అధికారిక వెబ్‌సైట్ ntro.gov.in ని సందర్శించవచ్చు.
జీతం..
వియేటర్ II పోస్ట్ కోసం ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ. 56,100 నుండి రూ. 1,77,500 వరకు జీతం పొందుతారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థఇ నెలకు రూ.44,900 నుండి రూ.1,42,400 పొందుతారు.
దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. అయితే SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
- దరఖాస్తు చేయడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే ntro.gov.in కి వెళ్లండి.
- ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
-తర్వాత మీ వివరాలను పూరించాలి. తదుపరి దశలో పత్రాలను అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించండి.
-చివరగా దరఖాస్తును సమర్పించండి. మీకు కావాలంటే, మీరు అప్లికేషన్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
అప్లికేషన్ లింక్ డిసెంబర్ 31వ తారీఖు ఓపెన్ అవుతుంది.
వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:
https://chat.whatsapp.com/JsTuEfIY6B70GU7z1dq081
Telegram Job Notification Link:
0 comments:
Post a Comment