చాలా మంది అభ్యర్థులు చదువు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతుంటారు. కొన్ని సంవత్సరాలపాటు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోవడానికి శ్రమిస్తుంటారు.అలాంటి అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పలు ప్రభుత్వరంగ సంస్థలు వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) జారీ చేశాయి. ఈ వారం దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఉద్యోగాల జాబితాను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఐఐఎస్- బెంగళూరు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు IISc అధికారిక వెబ్‌సైట్ cdn.digialm.com ద్వారా జనవరి 6లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా సమాచారం సెండ్ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉండనుంది.
SBI
అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 1438 కలెక్షన్ ఫెసిలిటేటర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 22న ప్రారంభమైంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా 60 సంవత్సరాల వయస్సులో సూపర్‌యాన్యుయేషన్ పొంది ఉండాలి. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్స్‌లో రిటైర్డ్ ఆఫీసర్ అయి ఉండాలి. అర్హులైన దరఖాస్తుదారులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా జనవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ - రాజస్థాన్
రాష్ట్రవ్యాప్తంగా 48వేల టీచర్ పోస్టుల భర్తీకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-రాజస్థాన్ రీట్-2023 పరీక్షను నిర్వహించనుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21 ప్రారంభం కాగా, జనవరి 19 తో ముగియనుంది. recruitment.rajasthan.gov.in ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రీట్ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది. లెవల్-1, లెవెల్- 2 కోసం విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫిబ్రవరి 25 నుంచి 28వ తేదీ వరకు వివిద దశల్లో జరగనుంది.
కేంద్రీయ విద్యాలయాలు
కేంద్రీయ విద్యాలయాల్లోని గ్రూప్-ఏ, డిప్యూటీ కమిషనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు kvsangathan.nic.in ద్వారా డిసెంబర్ 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంగా ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 2,09,200 వరకు జీతం లభిస్తుంది.
రాజస్తాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్
రాజస్థాన్ స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ (RSMSSB) ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ పోస్టులను భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు rsmssb.rajasthan.gov.in ద్వారా జనవరి 19 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయనున్నారు.
0 comments:
Post a Comment