టర్మీడియెట్ అర్హతతో ఈ 1400 పోస్టులకు పోటీ పడొచ్చు.అదేవిధంగా అగ్నివీర్(ఎంఆర్)100 పోస్టులకు మరో ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణతతో వీటికి పోటీ పడొచ్చు. ఈ రెండు పోస్టులకు అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌ఎస్‌ఆర్(సీనియర్ సెకండరీ రిక్రూట్), ఎంఆర్(మెట్రిక్ రిక్రూట్) పోస్టులకు రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షలు, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు శిక్షణ కాలంతో కలుపుకొని నావికాదళంలో నాలుగేళ్లపాటు సేవలు అందించొచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శ్వాశత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగతావారు ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలగాల్సి ఉంటుంది.
అగ్నివీర్ ఎస్‌ఎస్‌ఆర్
అగ్నివీర్(ఎస్‌ఎస్‌ఆర్) మొత్తం 1400 పోస్టుల్లో మహిళలకు 280 పోస్టులు లభిస్తాయి.
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా.. కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 01.05.2022-31.10.2005 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత మహిళలు, పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు 157 సెం.మీ, మహిళలు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
ఎంపిక విధానం
షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష(సీబీఈ), రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఎఫ్‌టీ), మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష ఇలా
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష హిందీ/ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలు-100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమేటిక్స్, జనరల్ అవేర్‌నెస్.. నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కును తగ్గిస్తారు.
కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్టేజŒ 2 రాత పరీక్ష నిర్వహిస్తారు. వీరికి ఫిజికల్ టెస్టులూ ఉంటాయి. వీటన్నింటిలో విజయం సాధిస్తే.. చివరగా మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ దశనూ దాటిన వారికి స్టేజ్-2లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్, చిలకలో 2023 మే నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.అగ్నివీర్ (ఎంఆర్)
అగ్నివీర్ ఎంఆర్‌కు సంబంధించి వంద ఖాళీలను ప్రకటించారు. ఇందులో మహిళలకు 20 పోస్టులు లభిస్తాయి.పదో తరగతి ఉత్తీర్ణతతో వీటికి పోటీపడొచ్చు. మే1, 2002 నుంచి అక్టోబర్ 31, 2005 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఇలా
అగ్నివీర్(ఎంఆర్) రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో 50 మార్కులు-50 ప్రశ్నలకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి పొరపాటు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్టేజ్ 2 పరీక్ష ఉంటుంది. వీరికి ఫిజికల్ స్టాండర్ట్ టెస్టులు, మెడికల్ టెస్టులు ఉంటాయి.
అగ్నివీర్‌తో ప్రయోజనాలు ఇవే..
వేతనాలు: అగ్నివీర్‌లుగా ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000 వేతనంగా చెల్లిస్తారు.
సేవానిధి ప్యాకేజీ
అగ్నివీరులకు నాలుగేళ్ల సేవలకుగాను సేవానిధి ప్యాకేజీ అందిస్తారు. ప్రతినెలా వచ్చే వేతనం నుంచి 30శాతం కార్పస్ ఫండ్‌కు జమచేస్తారు. ఇలా మొత్తం నాలుగేళ్లకు రూ.5.02 లక్షలు జమ అవుతాయి. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఇలా మొత్తం రూ.10.04 లక్షలు, దానిపై వడ్డీ కలిపి నాలుగేళ్ల అనంతరం ప్యాకేజీగా అందిస్తారు. దీంతోపాటు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
30 వార్షిక సెలవులు ఉంటాయి. నాలుగేళ్లు సర్వీసులో ఉన్నప్పుడు రిస్క్ అండ్ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది.
ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎస్‌ఎస్‌ఆర్, ఎంఆర్ దరఖాస్తుల స్వీకరణ: డిసెంబర్ 8 నుంచి 17 వరకు;
శిక్షణ ప్రారంభం: 2023 మే నెలలో
వెబ్‌సైట్: https://joinindiannavy.gov.in
0 comments:
Post a Comment