కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9న జాబ్ మేళా
కోవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. జాబ్‌మేళా పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు.రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయక్త ఆధ్వర్యంలో జరిగే జాబ్‌మేళాలో 15 ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న 1367 పోస్టులు భర్తీ చేయనున్నట్టు జిల్లా ఉపాధి కల్పణాధికారి కె.హరీష్‌చంద్రప్రసాద్ తెలిపారు. 19 నుంచి 30 ఏళ్ల వయసున్న పదో తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎస్సీ కెమిస్ట్రీ, బీకాం, ఎం-ఫార్మసీ, బి-ఫార్మసీ, డి-ఫార్మసీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తికల్గిన వారు రెజ్యూమ్, ఆధార్, ఇతర సర్టిఫికెట్‌లతో 9వ తేదీ ఉదయం కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శీలం ప్రశాంత్, జేడీఎం సుమలత, ప్లేస్‌మెంటు ఎగ్జిక్యూటివ్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment