Hyderabad : B Tech విద్యార్థులకు ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లో 212 పోస్టులు.. పూర్తి వివరాలివే

ECIL Hyderabad Recruitment 2022 : హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) 2022-23 సంవత్సరానికి గానూ 212 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్‌, సివిల్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌, నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 212

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు: 150

డిప్లొమా అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు: 62
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్‌, సివిల్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: అప్రెంటిస్‌షిప్‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
అప్రెంటిస్‌షిప్‌ వ్యవధి: 1 ఏడాది.
స్టైపెండ్‌: నెలకు రూ.9000, టీఏ. రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్‌ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: డిసెంబర్‌ 26, 2022
అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ ప్రారంభం: జనవరి 02, 2023.

వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర , ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసిన వారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి

Telegram Group:https://t.me/apjobs9

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top