కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ పరిధిలోని పాలిక్లినిక్‌లలో.. ఒప్పంద ప్రాతిపదికన 189 ఓఐసీ పాలిక్లినిక్, మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆయా పోస్టును బట్టి 8వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి.ఆసక్తి కలిగిన వారు డిసెంబర్ 9, 2022వ తేదీలోపు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న దరఖాస్తును పూరించి, అవసరమైన ఇతర డాక్యుమెంట్లను కింది అడ్రస్‌లో సమర్పించాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.16,800ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
ఓఐసీ పాలిక్లినిక్ పోస్టులు: 3
మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు: 10
గైనకాలజిస్ట్ పోస్టులు: 3
మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 34
డెంటల్ ఆఫీసర్ పోస్టులు: 9
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 5
ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు: 7
ఫార్మసిస్ట్ పోస్టులు: 6
డ్రైవర్ పోస్టులు: 4
నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులు: 9
చౌకీదార్ పోస్టులు: 6
ప్యూన్ పోస్టులు: 6
ఫిమేల్ అటెండెంట్ పోస్టులు: 7
సఫాయివాలా పోస్టులు: 8
అడ్రస్:
Stn HQ (ECHS Cell), ECHS Polyclinics Delhi cantt, Shakurbasti, Sihna Road, Dundahera, Lohhi Road, Timarpur, NIODA and Grater NOIDA.
ఈమెయిల్ ఐడీ..
oicechscelldelhi@gmail.com
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావాల్సిన వారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
Official Website: Click Here
0 comments:
Post a Comment