BEL: బీటెక్‌ నిరుద్యోగులకు జాబ్స్‌! భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 41 ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి..బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 41 ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్‌ సైన్స్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యునికేషన్‌/కమ్యునికేషన్‌/ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలీకమ్యునికేషన్‌/టెలీకమ్యునికేషన్‌/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ లేదా తత్సమాన స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం అవసరం. దరఖాస్తుదారుల వయసు డిసెంబర్‌ 1, 2022వ తేదీనాటికి 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారు విశాఖపట్నం, బెంగళూరులో పనిచేయవల్సి ఉంటుంది.ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 22, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయలో ప్రాజెక్ట్‌ ఇంజనీరి పోస్టులకు రూ.400, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.150లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్‌:
Sr. Dy. General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore – 560013, Karnataka.

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావాల్సిన వారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి


Complete Details: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top