కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (డిసెంబర్ 26)తో ముగుస్తోంది. తాజా ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు గడువును వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగఠన్ సోమవారం (డిసెంబర్ 26) ప్రకటనను జారీ చేసింది. ఐతే తాజా ప్రకటనతో విద్యార్హతలు, వయసు, అనుభవం విషయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది.
దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం లభించినట్లైంది. ఆయా విద్యార్హతలున్నవారు వచ్చే సోమవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్-ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.2300లు, పీఆర్టీ/టీజీటీ/పీజీటీ/ఫైనాన్స్ ఆఫీసర్/ఏఈ/లైబ్రేరియన్/ఏఎస్‌ఓ/హెచ్‌టీ పోస్టులకు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు రూ.1200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి దరఖాస్తుదారుల వయసు 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటే సరిపోతుంది.
KVS 2022 Recruitment Notification
0 comments:
Post a Comment