SAIL : టెన్త్‌, ఇంటర్‌, బీటెక్‌, పీజీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో 259 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

SAIL Recruitment 2022 : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భిలాయ్‌లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) 259 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మైనింగ్‌ మేట్‌, ఓసీటీ ట్రెయినీ తదితర పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 259
పోస్టులు: సీనియర్‌ కన్సల్టెంట్‌, కన్సల్టెంట్‌, మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, మైనింగ్‌ మేట్‌, ఓసీటీ ట్రెయినీ తదితర పోస్టులున్నాయి.
విభాగాలు: హైడ్రాలిక్స్‌ మెయింటనెన్స్‌, జనరల్‌ మెడిసిన్‌, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, మెకానికల్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ డిప్లొమా/ ఐటీఐ/ బీఈ/ బీటెక్‌/ ఎంబీబీఎస్‌/ డీఎం/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్‌/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.25070-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.700
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్‌ 26, 2022
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్‌ 17, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://sailcareers.com/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top