PGCIL Recruitment 2022 : న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL).. ఆర్‌డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 800 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ 21 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి.
మొత్తం ఖాళీలు: 800
ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 50 పోస్టులు
ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 15 పోస్టులు
ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ): 15 పోస్టులు
ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 480 పోస్టులు
ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 240 పోస్టులు
ముఖ్య సమాచారం:
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 11.12.2022 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000; ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ.23,000-రూ.1,05,000.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.400, ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 21, 2022.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 11, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.powergrid.in/
0 comments:
Post a Comment