పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు.
RRC-West Central Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- వెస్ట్ సెంట్రల్ రైల్వే 2022-23 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధింత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులను మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు. సరైన అర్హతలు ఉన్నవారు డిసెంబరు 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అప్రెంటిస్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 2521 పోస్టులు
డివిజన్‌ల వారీగా ఖాళీలు..
1. జబల్పూర్ డివిజన్: 884 పోస్టులు
2. భోపాల్ డివిజన్: 614 పోస్టులు
3. కోట డివిజన్: 685 పోస్టులు
4. కోట వర్క్‌షాప్ డివిజన్: 160 పోస్టులు
5. సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్(CRWS BPL) డివిజన్: 158 పోస్టులు
6. హెచ్‌క్యూ/ జబల్‌పూర్ డివిజన్: 20 పోస్టులు
అర్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత విభాగంలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 17.11.2022 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తుల సమర్పణ, ప్రింటింగ్ తీసుకునే సమయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 08125930726 ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఈమెయిల్: rrc.jblpr2022@gmail.com
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. డెబిట్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ఈ-వాలెట్లు & మొదలైన వాటి ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక ప్రక్రియ: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ (పదోతరగతి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 18.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17.12.2022.
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment