AP Job Mela | స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరో జాబ్ మేళా
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో జాబ్ మేళాను ప్రకటించింది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు నెల్లూరులో మరో జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 140 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు: గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 నుంచి రూ.13,500 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన వారు నాయిడుపేటలో పని చేయాల్సి ఉంటుంది. Job Mela: ఏపీలో మంచి వేతనంతో 450 ప్రైవేట్ జాబ్స్ .. ఈ నెల 22న ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే అపోలో ఫార్మసీ: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుదారుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.ఇతర వివరాలు: - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. - రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 22న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.ఇంటర్వ్యూలను డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫీస్ , అయ్యప్పగుడి సెంటర్ దగ్గర, నెల్లూరు జిల్లా చిరునామాలో నిర్వహిస్తారు. - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 7780289591, 8790813132 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 comments:
Post a Comment