స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. డిసెంబర్ 1న భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఈ జాబ్ మేళాను కర్నూల్ జిల్లాలోని గూడూరులో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registrations) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కియా మోటార్స్ (Kia Motors), జియో మార్ట్ (Jio Mart), ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance), అమర రాజా బ్యాటరీస్ శ్రీరామ్ చిట్స్ తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి.
ఖాళీల వివరాలు:కియా మోటార్స్ (KIA Motors):ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా/బీటెక్ చేసిన వారు అప్లై చేుకోవచ్చు. ఎంపికైన వారు పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.16 వేలు. వయస్సు 18-27 ఏళ్లు.
అమర్ రాజా (Amararaja):ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 16-25 ఏళ్లు ఉండాలి.
0 comments:
Post a Comment