CISF Recruitment 2022: పదితోనే సీఐఎస్‌ఎఫ్‌ 787 కానిస్టేబుల్‌ పోస్టులు.. రాత పరీక్ష ఇలా..

మొత్తం పోస్టుల సంఖ్య: 787(పురుషులు-641, మహిళలు-69, ఎక్స్‌సర్వీస్‌మెన్‌-77)పోస్టులు/ట్రేడ్‌ల వారీగా ఖాళీలుకానిస్టేబుల్‌/కుక్‌-304, కానిస్టేబుల్‌/ క్లోబర్‌- 06, కానిస్టేబుల్‌/టైలర్‌-27, కానిస్టేబుల్‌/బార్బర్‌-102, కానిస్టేబుల్‌/వాషర్‌మ్యాన్‌-118, కానిస్టేబుల్‌/స్వీపర్‌-199, కానిస్టేబుల్‌/పెయింటర్‌-01, కానిస్టేబుల్‌/ప్లంబర్‌-04, కానిస్టేబుల్‌ /మాలి-03, కానిస్టేబుల్‌ /వెల్డర్‌-03.
బ్యాక్‌లాగ్‌ పోస్టులు: కానిస్టేబుల్‌ /కోబ్లర్‌-01, కానిస్టేబుల్‌ /బార్బర్‌-07.

అర్హతలు

పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయసు: 01.08.2022 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు

ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళా అభ్యర్థులు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ ఊపిరి పీల్చి,వదిలినప్పుడు 80-85 మధ్య ఉండాలి.

రన్నింగ్‌ టెస్ట్‌: పురుష అభ్యర్థులు 1.6 కి.మీ దూరాన్ని 6 నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి. మహిళా అభ్యర్థులు 800 దూరాన్ని 4 నిముషాల్లో పరుగెత్తాలి.

వేతనాలు: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రతి నెల రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనంగా పొందుతారు. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఎంపిక ప్రక్రియ

ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్‌ టెస్ట్, ఓఎంఆర్‌ బేస్డ్‌/కంప్యూటర్‌ బేస్డ్‌(సీబీటీ), మెడికల్‌ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష ఇలా

పీఎస్‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్‌ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. 100 ప్రశ్నలకు-100 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తారు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌/జనరల్‌ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ నాలెడ్జ్,ఎనలిటికల్‌ ఆప్టిట్యూడ్, హిందీ/ఇంగ్లిష్‌లో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌/హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 20.12.2022
వెబ్‌సైట్‌: https://cisfrectt.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top