CSL Recruitment 2022 : భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. 143 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా.. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేఫ్టీ ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలివే:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో డిప్లొమా లేదా తత్సమనా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నవంబర్ 30, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎంపిక విషయానికొస్తే.. షార్ట్ లిస్టింగ్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకైతే నెలకు రూ.10,200.. టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ పోస్టులకు రూ.12,000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. పూర్తి సమాచారాన్ని అధికారిక నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
0 comments:
Post a Comment