పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ.. మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత ఉపాధి శిక్షణతో పాటు ఉద్యోగ కల్పన కార్యక్రమం నిర్వహిస్తోంది.అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్..భోజన వసతితోపాటు ఉద్యోగం కల్పిస్తారు.
శిక్షణ కార్యక్రమాలు:
1. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్) సోలార్ సిస్టమ్ ఇన్ స్టాలేషన్, సర్వీస్
అర్హత: ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణత
2. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దోజీ, క్విల్డ్ బ్యాక్స్ మేకింగ్
అర్హత: 8వ తరగతి ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి: 6 నెలలు
ఇతర అర్హతలు: వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
చదువు మధ్యలో ఉన్న వారు అనర్హులు.
కావలసిన పత్రాలు:
అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్
పాస్ పోర్ట్ ఫొటోలు
ఆధార్ కార్డు
ఇన్‌కమ్ సర్టిఫికెట్
చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్ (గ్రా), పోచంపల్లి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ - 508284.
ఎంపిక తేదీ: డిసెంబర్ 5, 2022 ఉదయం 10 గంటలకు సంస్థలో హాజరు కావాలి.
వివరాలకు ఫోన్ : 9133908000, 9133908111, 9133908222.
0 comments:
Post a Comment