ఏపీ పోలీసు శాఖలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ కి త్వరలో నోటిఫికేషన్
ఏపీ పోలీసు శాఖలో 6500 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendra nath reddy) తెలిపారు. శ్రీకాకుళంలో పర్యటిస్తున్న ఆయన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన చేశారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్య తగ్గిందని ఆయన ఈ సందర్బంగా తెలిపారు తెలిపారు. మరోవైపు డీజీపీ ప్రకటనతో నిరుద్యోగులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి నుంచే పరీక్షల కోసం, అటు గ్రౌండ్ ప్రాక్టీస్ కోసం సంసిద్ధం అవుతున్నారు. మొన్న సీఎం..నేడు డీజీపీ మొన్నటికి మొన్న సీఎం జగన్ స్వయంగా 6,511 పోలీస్ (Police) ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో డీజీపీ కూడా త్వరలో పోలీసు కానిస్టేబుల్ జాబ్స్ భర్తీ అంటూ చెప్పుకొచ్చారు.అర్హత ఇలా.. కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏపీ నివాస రుజువు ఉండి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. ప్రధానంగా నాలుగు దశలు: కానిస్టేబుల్ పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హత సాధిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష బహుళ ప్రశ్నలతో కూడిన రాత పరీక్ష కాగా..ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ అభ్యర్థి యొక్క భౌతిక సామర్ధ్యాన్ని పరిశీలిస్తాయి. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అబ్యరఃదులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఈ పరీక్ష ముల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడి ఉంటుంది.ప్రిలిమ్స్ పరీక్ష విధానం: ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులు కాగా ఒక్కో పేపర్ లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. మెయిన్ పరీక్ష విధానం: మెయిన్ పరీక్షలో 200 ప్రశ్నలకు గానూ 200 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లిష్, అరిథమేటిక్, జనరల్ సైన్సు,హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటి, ఎకానమీ, కరెంటు అఫైర్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు.
0 comments:
Post a Comment