కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తోంది. ఈ క్రమంలో ఆయా యూనిట్లకు రక్షణ నిమిత్తం 787 కానిస్టేబుల్/ ట్రేడ్స్మన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు కనీస అర్హత పదో తరగతి కాగా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ పోస్టులకు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 787 (పురుషులు- 641, మహిళలు- 69, ఎక్స్ సర్వీస్ మెన్- 77)
విభాగాలు: కానిస్టేబుల్
కానిస్టేబుల్/కుక్: 304
కానిస్టేబుల్/కోబ్లర్ : 06
కానిస్టేబుల్/ట్రైలర్: 27
కానిస్టేబుల్/బార్బర్ : 102
కానిస్టేబుల్/వాషర్ మ్యాన్: 118
కానిస్టేబుల్/స్వీపర్ : 199
కానిస్టేబుల్/పెయింటర్: 01
కానిస్టేబుల్/మేసన్: 12
కానిస్టేబుల్/ప్లంబర్ : 04
కానిస్టేబుల్/మాలి: 03
కానిస్టేబుల్/వెల్డర్: 03
బ్యాక్ లాగ్ ఖాళీలు: 08
కానిస్టేబుల్/కోబ్లర్: 01
కానిస్టేబుల్/బార్బర్: 07
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది)
వయోపరిమితి: 01/08/2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. (అభ్యర్థులు 02/08/1999 కంటే ముందు, 01/08/2004 తర్వాత జన్మించి ఉండకూడదు)
జీత భత్యాలు: రూ.21,700 నుంచి రూ.69,100 వరకూ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
శారీరక ప్రమాణాలు:
పురుష అభ్యర్థులు: ఎత్తు- 170 సెం.మీ.; ఛాతి పరిమాణం- 80-85 సెం.మీ.
మహిళా అభ్యర్థులు: ఎత్తు- 157 సెం.మీ.
దరఖాస్తు ఫీజు: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/11/2022
దరఖాస్తులు చివరి తేదీ: 20/12/2022
Complete Notification: Click Here
0 comments:
Post a Comment