Mega Job Mela in AP: ఏపీలో ఎల్లుండి మెగా జాబ్ మేళా.. 13 కంపెనీల్లో 800లకు పైగా జాబ్స్.. రూ.35 వేల వరకు వేతనంతో..

AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 14న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ (APSSDC Job Mela Registration) చేసుకున్న వారికి ఈ నెల 14న వెంకటేశ్వరాపురంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Green Tech Industries:ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 నుంచి రూ.13,500 వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు నాయిడుపేటలో పని చేయాల్సి ఉంటుంది.

Bharath FIH Limited:ఈ సంస్థలో మొబైల్ అసెంబర్లర్స్ విభాగంలో 200 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి.

Bank of Baroda Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు ... ఖాళీల వివరాలివే

Shriram City Union Finance Limited:రికవరీ ఎగ్జిక్యూటివ్స్, మార్కెంటింగ్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి.

Amara Raja Batteries:ఈ సంస్థలో టెక్నీషియన్ విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ విభాగాల్లో 130 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది.


అపోలో ఫార్మసీ:ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, B/M/D ఫార్మసి చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ACT Fiber Net:ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వేతనం ఉంటుంది.

Flipkart:ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. డెలివరీ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి ఇంటర్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా మెడికల్ అలవెన్స్, రూ.9 వేల వరకు అడిషనల్ బోనస్ ఉంటుంది. ఎంపికకైన వారు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుంది.

-ఇంకా డీ-మార్ట్, హీరో మోటో కార్పొ లిమిటెడ్, మెడ్ ప్లస్, మెడికవర్ హాస్పటల్స్ లో జాబ్స్ ఉన్నాయి.

Registration Link: Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top