Indian Navyలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్స్‌ ఎంట్రీ

ఇండియన్‌ నేవల్‌ అకాడమీ - షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల నియామకానికి ఉద్దేశించిన కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.ఎక్స్‌టెండెడ్‌ నేవల్‌ ఓరియంటేషన్‌ 

ఖాళీలు 217

కేరళ (ఎజిమలా)లోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీ - షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల నియామకానికి ఉద్దేశించిన కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎక్స్‌టెండెడ్‌ నేవల్‌ ఓరియంటేషన్‌ కోర్స్‌ - జనరల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌) జీఎస్‌ (ఎక్స్‌)/ హైడ్రోగ్రఫీ, రెగ్యులర్‌ నేవల్‌ ఓరియంటేషన్‌ కోర్స్‌ (ఎన్‌ఓసీ)లు అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్‌, ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ బ్రాంచ్‌లలో ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత బ్రాంచ్‌లు/ కేడర్లు/ స్పెషలైజేషన్‌లలో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులు 2023 జూన్‌లో ప్రారంభమౌతాయి. అవివాహిత అభ్యర్థులు (మహిళలు, పురుషులు) మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 217 ఖాళీలు ఉన్నాయి. సర్వీస్‌ వ్యవధి పదేళ్లు. మరో నాలుగేళ్లు పొడిగించే వీలుంది. ప్రొబెషన్‌ సమయం రెండేళ్లు. 

ఖాళీల వివరాలు - అర్హత

జనరల్‌ సర్వీస్‌ (జీఎస్‌ ఎక్స్‌)/ హైడ్రో క్యాడర్‌: మొత్తం 56 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 6 ఖాళీలను హైడ్రో క్యాడర్‌కు కేటాయించారు. జనరల్‌ సర్వీ్‌సలో 16, హైడ్రో క్యాడర్‌లో 2 ఖాళీలను మహిళలకు ప్రత్యేకించారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి. 

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ (ఏటీసీ), నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌, పైలట్‌: ఏటీసీ క్యాడర్‌లో 5 ఖాళీలు ఉన్నాయి. నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌లో 15, పైలట్‌ క్యాడర్‌లో 25 ఖాళీలు ఉండగా ఒక్కోదానిలో 3 ఖాళీలను మహిళలకు ప్రత్యేకించారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో పదోతరగతి, ఇంటర్‌, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతి/ ఇంటర్‌ స్థాయిలో ఇంగ్లీ్‌షలో 60 శాతం మార్కులు తప్పనిసరి 

లాజిస్టిక్స్‌: ఈ క్యాడర్‌లో 20 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 6 ఖాళీలను మహిళలకు ప్రత్యేకించారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ/ బీకాం/ బీఎస్సీ (ఐటీ) ఉత్తీర్ణతతోపాటు పీజీ డిప్లొమా (ఫైనాన్స్‌/ లాజిస్టిక్స్‌/ సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌/ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణులు; ఎంసీఏ/ ఎమ్మెస్సీ (ఐటీ) పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎడ్యుకేషన్‌: ఈ క్యాడర్‌లో 12 ఖాళీలు ఉన్నాయి. 

అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్‌)తోపాటు ఎమ్మెస్సీ(మేథ్స్‌/ ఆపరేషనల్‌ రిసెర్చ్‌/ కెమిస్ట్రీ); బీఎస్సీ(మేథ్స్‌)తోపాటు ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌/ అప్లయిడ్‌ ఫిజిక్స్‌) పూర్తిచేసినవారు; (బీఈ/ బీటెక్‌)(మెకానికల్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రికల్‌); ఎంటెక్‌ (మాన్యుఫాక్చరింగ్‌/ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌/ మెటీరియల్‌ సైన్స్‌) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ/ పీజీ స్థాయిలో 60 శాతం మార్కులు తప్పనిసరి
ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ (జీఎస్‌): ఈ క్యాడర్‌లో 25 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 7 ఖాళీలను మహిళలకు ప్రత్యేకించారు.

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో (బీఈ/ బీటెక్‌)(మెకానికల్‌/ మెకానికల్‌ - ఆటొమేషన్‌/ మెరైన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ప్రొడక్షన్‌/ ఏరోనాటికల్‌/ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌/ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/ ఏరోస్పేస్‌/ ఆటొమొబైల్స్‌/ మెటలర్జీ/ మెకట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ (జీఎస్‌): ఈ క్యాడర్‌లో 45 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 13 ఖాళీలను మహిళలకు ఉద్దేశించారు. 

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో (బీఈ/ బీటెక్‌)(ఎలకా్ట్రనిక్స్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌/ టెలీ కమ్యూనికేషన్‌/ అప్లయిడ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ అప్లయిడ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ పవర్‌ ఇంజనీరింగ్‌/ పవర్‌ ఎలకా్ట్రనిక్స్‌) పూర్తిచేసి ఉండాలి.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో (బీఈ/ బీటెక్‌)(మెకానికల్‌/ మెకానికల్‌ - ఆటొమేషన్‌/ సివిల్‌/ ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌/ మెటలర్జీ/ నేవల్‌ ఆర్కిటెక్చర్‌/ ఓషన్‌ ఇంజనీరింగ్‌/ మెరైన్‌ ఇంజనీరింగ్‌/ షిప్‌ టెక్నాలజీ/ షిప్‌ బిల్డింగ్‌/ షిప్‌ డిజైన్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక: బీఈ/ బీటెక్‌ అభ్యర్థులకు అయిదో సెమిస్టర్‌ వరకు వచ్చిన మార్కులను; ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్‌ అభ్యర్థులకు కోర్సు మొత్తమ్మీద సాధించిన మార్కులను; చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులకు ప్రీ ఫైనల్‌ ఇయర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకొని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరిని ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అర్హులకు అవకాశం కల్పిస్తారు. 

ట్రెయినింగ్‌: ఎంపికైన అభ్యర్థులకు సబ్‌ లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ ఇస్తారు. ఎక్స్‌టెండెడ్‌ ఎన్‌ఓసీ(జనరల్‌ సర్వీస్‌/ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ హైడ్రో) క్యాడర్‌ ఆఫీసర్లకు 44 వారాలు; రెగ్యులర్‌ ఎన్‌ఓసీ అఫీసర్లకు 22 వారాల పాటు కేరళ - ఎజిమలా నేవల్‌ అకాడమీలో శిక్షణ ఉంటుంది. దీనితోపాటు నేవల్‌ షిప్‌లలో ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ కూడా ఇస్తారు. 

ముఖ్య సమాచారం

వయసు: అభ్యర్థులు 1998 జూలై 2 నుంచి 2004 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. 

ప్రారంభ వేతనం: రూ.56100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 6

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top