గూగుల్ సంస్థ వివిధ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా డిజిటల్ మార్కెటింగ్,ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటిస్‌షిప్‌లను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు అక్టోబర్ 27 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పనిచేయవలిసిన ప్రాంతాలు బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, గుర్గావ్. సంబంధిత విభాగంలో తగినంత పని అనుభవం ఉండాలి. అభ్యర్ధులకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సమస్య-పరిష్కార మరియు విశ్లేషణ, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల మరియు వ్రాయగల సామర్థ్యం ఉండాలి.
వివరాలు...
అప్రెంటిస్‌షిప్
1. డిజిటల్ మార్కెటింగ్ అప్రెంటిస్‌షిప్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: డిజిటల్ మార్కెటింగ్‌లో గరిష్టంగా 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
స్కిల్స్: కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సమస్య-పరిష్కార మరియు విశ్లేషణ, టైం మేనేజ్‌మెంట్ స్కిల్స్ కలిగి ఉండాలి.
2. ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ అప్రెంటిస్‌షిప్
అర్హత: ఇంజనీరింగ్/ టెక్నికల్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: ఐటీ లేదా సంబంధిత సాంకేతిక విభాగంలో 6 నెలల అనుభవం ఉండాలి.
స్కిల్స్: కస్టమర్ సర్వీస్ రంగంలో అనుభవంతో పాటు ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల మరియు వ్రాయగల సామర్థ్యం ఉండాలి.
3. డేటా అనలిటిక్స్ అప్రెంటిస్‌షిప్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: డేటా అనలిటిక్స్‌లో గరిష్టంగా 1 సంవత్సరం సంబంధిత పని అనుభవం.
స్కిల్స్: కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సమస్య-పరిష్కార మరియు విశ్లేషణ, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల మరియు వ్రాయగల సామర్థ్యం ఉండాలి.
4. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అప్రెంటిస్‌షిప్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: ప్రాజెక్ట్ నిర్వహణలో గరిష్టంగా 1 సంవత్సరం అనుభవం.
స్కిల్స్: కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సమస్య-పరిష్కార మరియు విశ్లేషణ, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగల మరియు వ్రాయగల సామర్థ్యం ఉండాలి.
పని ప్రదేశం: బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, గుర్గావ్.
అప్రెంటిస్ వ్యవధి: 12-24 నెలలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం: ఫిబ్రవరి 2023.
దరఖాస్తుకు చివరి తేది: 27.10.2022.
Job Notification టెలిగ్రామ్ గ్రూపులో చేరండి:
0 comments:
Post a Comment