ఎస్‌బీఐలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. అర్హులైనవారు ఈ నెల 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1673 పీవో పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో 1600 రెగ్యులర్‌ పోస్టులు కాగా, 73 బ్యాక్‌లాగ్‌ ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1673

ఇందులో జనరల్‌ 648, ఓబీసీ 464, ఈడబ్ల్యూఎస్‌ 160, ఎస్సీ 270, ఎస్టీ 131 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: డిగ్రీ పూర్తిచేసి 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేస్తుకోవడానికి అర్హులే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష. మొదట ప్రిలిమ్స్‌ ఉంటుంది. అందులో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయవచ్చు. తర్వాత సైకోమెట్రిక్‌ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 12
ప్రిలిమ్స్‌: 2022, డిసెంబర్‌ 17, 18, 19, 20 తేదీల్లో
మెయిన్స్‌: 2023, జనవరి లేదా ఫిబ్రవరిలో
వెబ్‌సైట్‌: www.sbi.co.in


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top