మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్ (Good News) చెప్పింది దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ (Business Schools)లో ఒకటైన ఆసియా-పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ.. తమ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (PGDM) చదువుతున్న వారికి స్పెషల్ స్కాలర్‌షిప్స్ అందించనున్నట్లు తెలిపింది. వివిధ స్పెషలైజేషన్ల నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు రూ.1లక్ష వరకు స్పెషల్ ఫండ్ అందించనున్నట్లు తెలిపింది. సంస్థ అందించే స్కాలర్‌షిప్ మొత్తాన్ని కోర్సు ఫీజుతో సర్దుబాటు చేస్తుంది. పీజీడీఎం కోర్సుల్లో చేరే మొత్తం 30 మంది ఫస్ట్ ఇయర్ అభ్యర్థులను ఇన్‌స్టిట్యూట్ ఎంపిక చేయనుంది. స్కాలర్‌షిప్ విలువ రూ. 1,00,000 వరకు ఉంటుంది. సంస్థకు చెందిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ సెకండ్ ఇయర్ స్కాలర్‌షిప్.. మొదటి సంవత్సరం అకడమిక్ రిజల్ట్ ఆధారంగా ఇస్తారు. * ఎవరు అర్హులు? లేట్ B.B వర్మ స్కాలర్‌షిప్ పేరుతో అందించే ఈ ఫండింగ్ ప్రోగ్రామ్‌కు సంస్థ ప్రత్యేకమైన ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. మెరిట్-కమ్-పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఫైనల్ సెలక్షన్ అనేది కచ్చితంగా స్కాలర్‌షిప్ అవార్డు కమిటీ వారి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యుములేటివ్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతోపాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా స్కాలర్‌షిప్ అవార్డు కమిటీ సెలక్షన్ ప్రాసెస్ చేపడుతుంది.
ఏయే కోర్సుల వారికి? మేనేజ్‌మెంట్ ఎడ్యేకేషన్‌లో నిపుణులను ప్రోత్సహించేందుకు ఆసియా-పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా PGDM (జనరల్), PGDM (హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్), PGDM (బిగ్ డేటా అనలిటిక్స్), PGDM (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్), PGDM (మార్కెటింగ్) అభ్యర్థులకు సహాయం చేయడానికి స్పెషల్ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ asiapacific.edu ద్వారా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు కొన్ని గంటలే గడువు మంచి అకడమిక్ రికార్డు ఉన్న అప్లికెంట్‌కు ఈ స్కాలర్‌షిప్ అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. CAT/XAT/CMAT/MAT వంటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో ఎక్కువ పర్సంటైల్ స్కోర్ సాధించిన విద్యార్థులకు.. మెరిట్ కమ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. దీంతోపాటు స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్‌లో బెస్ట్ పర్సంటైల్/పర్సెంటేజ్/CGPA స్కోర్ సాధించి ఉండాలి. ఆసియా పసిఫిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (AIM) భారతదేశంలోని టాప్ 10 ప్రైవేట్ బీ-స్కూల్స్‌లో ఒకటి. AICTE ఆమోదించిన PGDM జనరల్ ప్రోగ్రామ్ ఈ ఇన్‌స్టిట్యూట్ అందించే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్. దీంతోపాటు AICTE ఆమోదం పొందిన PGDM (మార్కెటింగ్), PGDM (ఇంటర్నేషనల్ బిజినెస్), PGDM (బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్), PGDM (హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) వంటి ప్రోగ్రామ్స్‌కు కూడా ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది.
Online Application: Click Here
0 comments:
Post a Comment