ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కర్నూలు జిల్లా ఆధోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ జాబ్ మేళాలో దాదాపు 16 కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇందులో పాల్గొనాలని అనుకునేవాళ్లు www.apssdc.in లో ముందుగానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
1. కియా మోటార్స్( KIA motors): కియా మోటార్స్ సంస్థలో ట్రైనీ టెక్నీషియన్స్ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. జాబ్ లోకేషన్ అనంతపురం జిల్లా పెనుకొండలో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ. 16 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
2. రైజ్ & షైన్ కంపెనీ (Raise and Shine): ఈ సంస్థలో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్స్ సూపర్‌వైజర్ విభాగంలోని ఖాళీల భర్తీకి ఈ కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చింది. జాబ్ లోకేషన్ వచ్చేసరికి భారతదేశం, UAE మరియు ఆ సంస్థ ఉన్న ప్రాంతాలలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పొజిషన్ ఆధారంగా 20 వేల నుండి 40 వేల వరకు చెల్లించనున్నారు.
3. PEOPLE PRIME : ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ హైదరాబాద్ ఇవ్వనున్నారు. జీతం నెలకు రూ.12 వేల రూపాయలతో పాటు ప్రోత్సాహకాలు కూడా చెల్లించనున్నారు. దీనికి పురుషులు, స్త్రీలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
4. A1 సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ (A1 Software Solutions): ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ విభాగంలో భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇస్తారు. ఎంపికైన విభాగాన్ని బట్టి జీతం నెలకు రూ.20 వేలతో పాటు రూ.5 వేల వరకు ప్రోత్సాహకాలు, క్యాబ్ సర్వీసు ఫెసిలిటీ ఉంది. దీనికి పురుషులు, స్త్రీలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
5. ట్రూ స్కేల్ సొల్యూషన్స్ (True scale solutions) : ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులకు రూ.15వేల వరకు చెల్లించనున్నారు. దీనికి పురుషులు, స్త్రీలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు.
-10వ/ఇంటర్/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/బి. టెక్/డి-ఫార్మసీ అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఇలా మొత్తం 16 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్నాయి. ఈ జాబ్‌మేళాకు వచ్చే వాళ్లు మల్టిపుల్ రెజ్యూమ్‌లతో పాటు పూర్తి ఫార్మల్ డ్రెస్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్, ఫోటోలతో రావాల్సి ఉంటుంది.
-జాబ్ మేళాకు వచ్చే వారి వయస్సు 18-35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
అభ్యర్థులు పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:
1.శ్రీనివాసులు, 7799494856
2. రాజశేఖర్, 9177413642
3. రామాంజనేయులు,7569068058
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
0 comments:
Post a Comment